గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు రైతులు ఆందోళనకు దిగారు. గవర్నర్ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలపటంతో ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ నిర్ణయానికి నిరసనగా.. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేసే, మూడుముక్కలాటను సీఎం మానుకోవాలని హితువు పలికారు. లేకపోతే.. ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామనీ.. దీనికి సంబంధించిన కార్యచరణ త్వరలోనే రూపొందిస్తామని స్పష్టం చేశారు.
గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలంతా రాజీనామా చెయ్యాలి: పొన్నైకల్లు రైతులు - అమరావతి రైతులు ఆందోళన వార్తలు
గుంటూరు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని గుంటూరు జిల్లా పొన్నేకల్లు రైతులు డిమాండ్ చేశారు. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపటంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు రాజధానుల ఆమోదానికి రైతుల నిరసన