ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాత్రైనా ఆగని అమరావతి ఉద్యమం.. - రాజధాని రైతుల ఆందోళన

రాత్రి సమయాల్లో సైతం అమరావతి రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అమరాతినే ఏకైక రాజధానిగా ప్రకటించేంత వరకు ఆందోళన విరమించమని వారు స్పష్టం చేశారు.

amaravathi farmers agitation
అమరావతి రైతుల ఆందోళన

By

Published : Apr 5, 2020, 5:48 AM IST

వెలుగు పేరుతో రాత్రి వేళల్లోనూ రాజధాని గ్రామాల్లో మహిళలు, రైతులు ఆందోళన కొనసాగించారు. తుళ్లూరు మండలం మందడం, రాయపూడి, అబ్బురాజుపాలెం, దొండపాడు, తుళ్లూరు గ్రామాల్లో మహిళలు ఆందోళనలో పాల్గొన్నారు. దీపాలు వెలగించి రైతులు, మహిళలు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మహిళలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగొచ్చి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని చెప్పేంతవరకు ఆందోళనను విరమించబోమని రైతులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details