ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అలుపెరగని అమరావతి రైతులు... 213వ రోజుకు నిరసనలు - amaravathi farmers

మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ రాజధాని రైతులు చేస్తున్న నిరసనలు 213వ రోజుకు చేరుకున్నాయి. ప్రాణాలు అర్పించైనా ఏకైక రాజధానిగా అమరావతిని సాధించుకుంటామని రైతులు స్పష్టం చేశారు.

amaravathi agitation
అమరావితి రైతుల దీక్షలు

By

Published : Jul 17, 2020, 11:13 PM IST

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు చేస్తున్న ధర్నాలు 213వ రోజుకు చేరుకున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి, మందడం, రాయపూడి, మల్కాపురం, దొండపాడు, మంగళగిరి మండలం నీరుకొండ, కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు, చిన్నారులు ధర్నాలో పాల్గొన్నారు. ప్రాణాలర్పించైనా అమరావతిని సాధిస్తామంటూ మహిళలు నినాదాలు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ధర్నాలో పాల్గొన్నారు. ఈ సుదీర్ఘ ఉద్యమంలో తమకు అండగా నిలిచిన న్యాయస్థానాలకు పాదాభివందనాలు అంటూ నినదించారు. తమను న్యాయవ్యవస్థే కాపాడుతోందని రైతులు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details