రాజధానిగా అమరావతి పరిరక్షణే లక్ష్యంగా నిరసనలు కొనసాగుతున్నాయి. వరుసగా 249వ రోజూ రాజధాని రైతులు ఆందోళన చేపట్టారు. వినాయక చవితిని ధర్నా శిబిరాల వద్దే నిర్వహించారు. అమరావతికి ఏర్పడిన విఘ్నాలను తొలగించాలంటూ తుళ్లూరులో రైతులు, మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందడం, వెలగపూడి, పెదపరిమి, కృష్ణాయపాలెంలోనూ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల నిర్ణయంతో తమ జీవితాలు అగమ్యగోచరంగా మారాయన్నారు. పండగ చేసుకునే అవకాశమే లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ఉద్యమం 250వ రోజుకు చేరుకుంటున్న తరుణంలో రైతుల ఐక్యకార్యాచరణ సమితి ప్రత్యేక నిరసన కార్యక్రమాలకు సన్నాహాలు చేసినట్టు తెలిపింది.
అమరావతి కోసం ఆగని రైతుల ఆందోళన - అమరావతి ఉద్యమం వార్తలు
మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వినాయకచవితిని దీక్షా శిబిరాల్లో నిర్వహించి.. అమరావతికి ఏర్పడిన విఘ్నాలను తొలగించాలని కోరారు.
అమరావతి రైతుల ఆందోళన