అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ప్రత్యేక పూజలు
పరిపాలనా రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం 271వ రోజుకు చేరుకుంది. మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని రాజధాని గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు.
ఉద్దండరాయునిపాలెంలో అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మహిళలు పూజలు చేశారు రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. వెంకటపాలెంలో మహిళలు మానవహారం చేపట్టారు. అమరావతి మద్దతుగా నినాదాలు చేశారు. గ్రామ దేవత గంగానమ్మ తల్లికి పూజలు చేశారు. గ్రహాలన్నీ ఒకే స్థానంలోకి వచ్చిన సందర్భంగా మందడంలో రైతులు మహిళలు ఆదిత్య పారాయణం చేపట్టారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మందడంలో మహిళలకు సంఘీభావం ప్రకటించారు. అసైన్డ్ భూములపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను రైతులు ఖండించారు.