రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పోరాటం 378వ రోజుకు చేరుకుంది. రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగించారు. దీక్షా శిబిరాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాజధానికి మద్దతుగా తుళ్లూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు, రైతులు పాల్గొని జై అమరావతి అంటూ నినదించారు.
న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: అమరావతి రైతులు - అమరావతి నిరసనలు
అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తోన్న ఆందోళనలు 378వ రోజుకు చేరుకున్నాయి. రాజధానికి మద్దతుగా తూళ్లూరులో ర్యాలీ నిర్వహించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.
న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: అమరావతి రైతులు
మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్ధండరాయునిపాలెం, బోరుపాలెం, పెదపరిమి, దొండపాడు, వెంకటపాలెం, అనంతవరం, పెనుమాక గ్రామాల్లో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా... ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు తెలిపారు. శాంతియుత మార్గంలోనే తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.