రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించటాన్ని నిరసిస్తూ అమరావతిలో రైతుల ఆందోళనలు మొదలయ్యాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడం, ఉద్దండరాయపాలెం ప్రాంతాల్లో రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కరోనా నేపథ్యంలో ఇళ్ల వద్దే ఆందోళనలు చేస్తున్న రైతులు నేడు మళ్లీ శిబిరాలకు తరలివచ్చారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై అమరావతి అంటూ నినదించారు.
'న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం' - latest news on three capital
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించడంపై అమరావతి ప్రాంతంలో రైతులు నిరసనలు తెలుపుతున్నారు. రాజకీయ నాయకులు భవిష్యత్ పాలన కోసం ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి కోసం శాంతియుతంగా ఉద్యమం చేస్తామని, న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని రైతులు తెలిపారు..
అమరావతి రైతుల నిరసన
ఎనిమిది నెలలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. అమరావతి పరిరక్షణ సమితి ఐకాస తరపున ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బిల్లుల ఆమోదంపై న్యాయ పోరాటం చేస్తామని.. తప్పకుండా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల వైఖరిని కూడా రైతులు తప్పుబట్టారు.
ఇదీ చదవండి: సీఆర్డీఏ భవితవ్యం ఏమిటో?