విజయవాడ స్మృతివనంలో అంబేడ్కర్ విగ్రహాలను ఎత్తుకెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. దళిత ఐకాస నేతలు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం స్మృతివనంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు.
మోకాళ్లపై నిలుచుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్మృతివనం నిర్మాణ సామగ్రిని గుత్తేదారు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇది సరికాదని.. ఐకాస నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.