తిరోగమన పాలన మాకొద్దు..సీఎంపై అమరావతి రైతుల ఆక్రోశం - అమరావతి తాజా న్యూస్
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనలు ఇవాళ 89వ రోజుకు చేరుకున్నాయి. ఇన్ని రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం ఏమి పట్టకుండా వ్యవహరిస్తోందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తునారు.
రాజధానిగా అమరావతి ఉండాలని కోరుతూ.. రాజధాని గ్రామాల్లో 89వ రోజుకు నిరసనలు చేరాయి. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనపై వెనక్కి తగ్గాలంటూ.. రైతులు, మహిళలు ఆందోళన చేపట్టారు. తమను ఎన్నికలకు దూరం చేయడం పట్ల మందడం రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయపూడిలో మహిళలు వీధులను ఊడ్చి గాంధేయమార్గంలో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ పాలన సాగిస్తుందంటూ.. తుళ్లూరులో మహిళలు చేతులు వెనక్కి వంచి దండాలు పెడుతూ నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా సక్రమ పాలన చేయాలని.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.