రాజధాని అమరావతి (amaravathi)లో అసైన్డ్ రైతుల నుంచి... గత ప్రభుత్వ మంత్రులు భయపెట్టి భూములు లాక్కున్నారన్న గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి (MLA alla rama krishna reddy) వ్యాఖ్యలను అమరావతి రైతు ఖండించారు. తామంతా అమరావతి నిర్మాణానికి సంతోషంగానే భూములిచ్చామని.. ఎవరూ బలవంతంగా లాక్కోలేదని ఉద్ధండరాయునిపాలెంకు చెందిన ఓ రైతు పేర్కొన్నారు.
తమను అకారణంగా రామకృష్ణారెడ్డి మధ్యలో లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అవసరాల కోసం కొంత భూమిని అమ్ముకున్నామని... మిగిలిన దాంట్లో సాగు చేసుకుంటున్నామని చెప్పారు. కావాలంటే రామకృష్ణారెడ్డి వచ్చి పరిశీలించుకోవాచ్చని సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వానికి తమపై ప్రేమ ఉంటే కౌలు చెల్లింపులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.