పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... రైతులు చేస్తున్న ఉద్యమం 350వ రోజుకు చేరుకుంది. తుళ్లూరు, వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం, నీరుకొండ గ్రామాల్లో రైతులు ఆందోళన కొనసాగించారు. వెలగపూడిలో రోడ్డుపై నిలబడి నిరసన తెలిపారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో మహిళలు వినూత్న రీతిలో ఆందోళన చేశారు. 350 సంఖ్యపై కూర్చొని జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ మందడంలో మహిళలు నినదించారు.
350వ రోజు నిరసనలు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు - amaravathi capital protest latest news
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... రైతులు చేస్తున్న నిరసనలు 350వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లోని అన్నదాతలు, మహిళలు ఆందోళనల్లో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
![350వ రోజు నిరసనలు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు amaravathi capital farmers protest reaches 350th day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9726439-513-9726439-1606819806853.jpg)
350 వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఉద్యమం