రాజధాని అమరావతి పరిరక్షణకు రాష్ట్ర ప్రజలందరీ సహకారం కావాలని కోరుతూ... రాజధాని రైతులు, మహిళలు తుళ్లూరులో జోలె పట్టి అభ్యర్థించారు. రాజధానికి, రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ భూములు అప్పగించామని... ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతి భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చిందని రైతులు వాపోయారు. తమ ఉద్యమం 29 గ్రామాల ప్రజల సమస్య కోసం కాదని.. రాష్ట్ర ప్రజలందరీ సమస్య అని మహిళలు అన్నారు.
అమరావతిని పరిరక్షించాలంటూ జోలెపట్టి అభ్యర్థన - తుళ్లూరులో రైతులు, మహిళల ఆందోళన
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని ప్రాంతాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. వినూత్నంగా నిరసనలు చేపడుతూ ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు. అమరావతిని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రజలందరీ సహకారం కావాలని తుళ్లూరులో రైతులు, మహిళలు జోలె పట్టి అభ్యర్థించారు.
అమరావతిని పరిరక్షించాలంటూ జోలెపట్టి అభ్యర్థన