మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు 395వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, ఎర్రబాలెం, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడులో రైతులు, మహిళలు నిరసన దీక్షలు కొనసాగించారు. ఉద్దండరాయునిపాలెంలోని దీక్షా స్థలం వద్ద రైతులు, మహిళలు గోపూజ నిర్వహించి.. జై అమరావతి అంటూ నినదించారు. నమ్మి ఓట్లు వేసి అధికారం అప్పగించినందుకు.. జగన్ తమకు సరైన గుణపాఠం నేర్పారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు చేసిన అన్యాయానికి సరైన గుణపాఠాన్ని త్వరలోనే చెబుతామన్నారు.
395వ రోజుకు చేరుకున్న అమరావతి అన్నదాతల ఆందోళన
అమరావతి రైతుల ఆందోళన 395వ రోజుకు చేరుకుంది. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చుకునేంత వరకు... ఆందోళన కొనసాగుతుందని అన్నదాతలు స్పష్టం చేశారు.
అమరావతి అన్నదాతల ఆందోళన