రాజధానిగా అమరావతే ఉండాలని బ్రాండ్ అంబాసిడర్ చండీ హోమం - అమరావతి బ్రాండ్ అంబాసిడర్ హోమం
నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం.. అమరావతినే రాజధానిగా ఉంచాలని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి నవ దుర్గా చండీ హోమం నిర్వహించారు. కృష్ణా జిల్లా ముదినేపల్లిలో తన నివాసం వద్ద వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య మహా చండీ హోమం నిర్వహించారు. అవసరమైతే ప్రధాని మోదీని కలిసి అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరతానని ఆమె తెలిపారు.