ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ... రాజధాని గ్రామాల రైతులు, మహిళలు దీక్షా శిబిరాల వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి శిబిరాలతోపాటు రాజధాని గ్రామాల్లోనూ అమరావతి వెలుగు పేరిట కొవ్వొత్తులు వెలగించి తమ అభీష్టాన్ని తెలియజేశారు. జై అమరావతి- సేవ్ అంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు.
'ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి'
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... రాజధాని గ్రామాల రైతులు, మహిళలు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. వీరికి మద్దతుగా విజయవాడ గొల్లపూడిలో స్థానిక తెదేపా నేతలు కాగడాల ప్రదర్శన చేశారు.
కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్న రైతులు
అమరావతి రైతులకు మద్దతుగా... విజయవాడ గొల్లపూడిలో తెదేపా శ్రేణులు కాగడాలతో నిరసన చేపట్టారు. రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేసి అయిదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా... ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్ధానిక నాయకులు, రైతులు ధర్నా నిర్వహించారు. మూడు రాజధానుల అంశాన్ని మానుకుని ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.