ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాగార్జున యూనివర్సిటీలో న్యాయవిద్యను తిరిగి పునరుద్ధరించాలి : ఎన్​యూ పూర్వ విద్యార్థులు - న్యాయశాస్త్రాన్ని పునరుద్ధరించాలని

Renewal of Jurisprudence at ANU: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల న్యాయవిద్యను తిరిగి పునరుద్ధరించాలని పూర్వ విద్యార్థుల సంఘం డిమాండ్ చేసింది. ఏఎన్ యూలో 1979 నుంచి 2020 మధ్యకాలంలో న్యాయవిద్యను అభ్యసించిన విద్యార్థులంతా విశ్వవిద్యాలయంలో సమావేశమయ్యారు. పౌరులకు న్యాయం అందించడంలో న్యాయవాదుల పాత్ర కీలకమని..న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఏఎన్ యూలో ఐదేళ్ల న్యాయ విద్యను తిరిగి ప్రవేశపెడితే..విద్యార్థులకు బోధన చేస్తామని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రామకృష్ణప్రసాద్, జస్టిస్‌ కృపాసాగర్‌ అన్నారు.

Alumni students
ఎన్​యూ పూర్వ విద్యార్థులు

By

Published : Feb 6, 2023, 1:26 PM IST

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు

Renewal of Jurisprudence at ANU: గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల న్యాయవిద్యను తిరిగి పునరుద్ధరించాలని ఆదివారం జరిగిన పూర్వ విద్యార్థుల సంఘం డిమాండ్ చేసింది. ఏఎన్ యూలో న్యాయవిద్యను అభ్యసించిన 1979 నుంచి 2020 సంవత్సరం వరకు విద్యనభ్యసించిన విద్యార్థులంతా విశ్వవిద్యాలయంలో సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రామకృష్ణ, జస్టిస్ కృపా సాగర్ లు, ప్రభుత్వ న్యాయవాది నాగిరెడ్డి, అధ్యాపకులు, ప్రముఖ న్యాయవాదులు పాల్గొన్నారు. సమావేశం ముగిసేంత వరకు న్యాయమూర్తులు ఇద్దరు వేదిక కింద వరసలోనే కూర్చున్నారు. తాము ఎంత పెద్ద న్యాయమూర్తులైనా....గురువుల పక్కన కూర్చునే స్థాయికి చేరుకులేదని...సున్నితంగా తిరస్కరించి వేదిక కింద వరసలోనే ఆసీనులయ్యారు.

సమాజంలో అనారోగ్యం చెందితేనే వైద్యుడి వద్దకు వెళ్తారని....ఇతర సమస్యల పరిష్కారం కోసం న్యాయవాదిని సంప్రదించాల్సిందేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ చెప్పారు. పౌరులకు మంచి న్యాయం అందాలంటే న్యాయవాదుల పాత్ర ఎంతో ఉందన్నారు. ఏఎన్ యూలో ఐదేళ్ల న్యాయ విద్యను ప్రవేశపెడితే తాను వచ్చి ఉచితంగా పాఠాలు చెబుతానన్నారు.

మరో న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ మాట్లాడుతూ అధ్యాపకులపై అంకిత భావం ఉండాలని సూచించారు. వారి పట్ల ఉన్న అంకిత భావంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. అనంతరం న్యాయవిభాగం అధ్యాపకులను విద్యార్థులు ఘనంగా సత్కరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details