ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేరళ టూరిజం బోర్డులో ఐఏఎస్​ కృష్ణతేజ - ias krishan teja

కేరళ రాష్ట్రంలో అలెప్పీ జిల్లా సబ్​ కలెక్టర్​ మైలవరపు కృష్ణ తేజను ఆ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం బోర్డు అడిషనల్ డైరెక్టర్, జనరల్ టూరిజం డెవలప్మెంట్ ఎండీగా నియమిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది

కేరళ టూరిజం బోర్డులో ఐఏఎస్​ కృష్ణతేజ

By

Published : Sep 28, 2019, 9:18 AM IST

కేరళ రాష్ట్రంలో అలెప్పీ జిల్లా సబ్​ కలెక్టర్​ మైలవరపు కృష్ణ తేజ సేవలను గుర్తించి ఆ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం బోర్డు అడిషనల్ డైరెక్టర్, జనరల్ టూరిజం డెవలప్ మెంట్ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఐఏఎస్​ కృష్ణ తేజ 2018లో వచ్చిన అలప్పి వరదల సమయంలో సమర్థంగా పని చేశారు. 2017 లో అలప్పి జిల్లా సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు... 2018 ఆగస్టు లో కుట్టనాడు ప్రాంతంలో వరదలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితులలో కృష్ణ తేజ ఆపరేషన్ కుట్టునాడు ఏర్పాటు చేసి మూడు లక్షల మంది ప్రజలను కాపాడటంతో పాటు వేల సంఖ్యలో మూగజీవాలను రక్షించారు. ఆ తరువాత 100 అంగన్వాడీ కేంద్రాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. చైల్డ్ డెవలప్ మెంట్ లో కృష్ణ తేజ కృషిని గుర్తించిన కేరళ ప్రభుత్వం గత ఆగస్టులో ఉత్తమ ఐఏఎస్ అధికారి అవార్డుతోపాటు, ప్రశంస పత్రాన్ని సీఎం విజయన్ చేతుల మీదుగా అందజేశారు. ఇలా తక్కువ వయసులోనే సేవా దృక్పథంతో పాటు అత్యుత్తమ పనితీరును గుర్తించిన కేరళ ప్రభుత్వం కృష్ణ తేజకు ఉన్నతమైన బాధ్యతలను అప్పగించింది.

ABOUT THE AUTHOR

...view details