ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరిని రాజధాని చేయండి - ycp mla alla ramakrishnareddy

గుంటూరు జిల్లా మంగళగిరిని రాజధాని చేయాలంటూ గతంలోనే శాసనసభలో ప్రస్తావించానని స్థానిక శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. తుళ్లూరు మండలంలోని గ్రామాలు ముంపులో ఉన్నాయని.... అందుకే మంగళగిరిని రాజధాని చేయాలని డిమాండ్ చేశారు.

alla ramakrishna talking about capital

By

Published : Aug 24, 2019, 9:04 AM IST

ప్రస్తుత రాజధాని అమరావతి, మంగళగిరి మండలంలోని కొన్ని గ్రామాలు రాజధానిలో ఉన్నాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. తుళ్లూరు మండలంలోని గ్రామాలు ముంపులో ఉన్నాయని....అందుకే మంగళగిరిని రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతం భవనాలు కట్టుకోవడానికి అనువుగా ఉంటుందన్నారు. రాజధాని విషయంలో రైతులెవ్వరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే రైతులందరికీ కౌలు డబ్బులు తమ ఖాతాలలో వేస్తున్నట్లు వెల్లడించారు.

మంగళగిరిని రాజధాని చేయండి

ABOUT THE AUTHOR

...view details