గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామానికి చెందిన ఆళ్ల దశరథరామిరెడ్డి (86)కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గుంటూరు ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఆయన పెదకాకాని గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై గ్రామానికి తాగునీటి పథకం తీసుకురావడంతో పాటుగా.. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మల్లేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్ గా దేవాలయ అభివృద్ధికి కృషి చేశారు. ఆయన పెద్ద కుమారుడు రాంకీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత అయోధ్య రామిరెడ్డి ఇటీవల వైకాపా నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రెండవ కుమారుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు వైకాపా శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. మూడో కుమారుడు పేరురెడ్డి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ఆయన భార్య వీర రాఘవమ్మ కూడా పెదకాకాని సర్పంచ్ గా పనిచేశారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డికి పితృవియోగం.. సంతాపం తెలిపిన నారా లోకేశ్ - Alla Ayodhyaramireddy died in mangalagiri
రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి తండ్రి ఆళ్ల దశరథరామిరెడ్డి అనారోగ్యంతో మరణించారు. ఆళ్ల దశరథ రామిరెడ్డి మృతి పట్ల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సంతాపం తెలిపారు.

Alla Ayodhyaramireddy
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తండ్రి ఆళ్ల దశరథ రామిరెడ్డి మృతి పట్ల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇదీ చదవండి:మరో 10,199 పాజిటివ్ కేసులు.. కోలుకున్న 9,499 మంది