ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సకాలంలోనే అన్ని రకాల సేవలందించాలి: కలెక్టర్ శామ్యూల్ - Mangalagiri town latest News

గుంటూరు జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందుతున్నసేవలపై కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆరా తీశారు. దుగ్గిరాల, మంగళగిరి మండలాల్లో పర్యటించిన కలెక్టర్.. సచివాలయాలను తనిఖీ చేశారు.

సకాలంలోనే అన్ని రకాల సేవలందించాలి : కలెక్టర్ శామ్యూల్
సకాలంలోనే అన్ని రకాల సేవలందించాలి : కలెక్టర్ శామ్యూల్

By

Published : Sep 24, 2020, 6:57 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని 3వ వార్డు సచివాలయాన్ని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తనిఖీ చేశారు. రేషన్ కార్డుల సరఫరాలో తలెత్తిన సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు.

అందువల్లే సకాలంలో ఇవ్వలేకపోయాం..

కొంతమంది ఇళ్ల దగ్గర లేకపోవటం వల్లే సకాలంలో రేషన్ కార్డులు ఇవ్వలేకపోతున్నామని వార్డు వాలంటీర్లు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలకు సకాలంలో అన్ని రకాల సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని శామ్యూల్ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : యూపీఎస్సీ పరీక్షల నిర్వహణపై కేంద్రానికి నోటీసులు

ABOUT THE AUTHOR

...view details