ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మద్యం దుకాణాలపై ఉన్న శ్రద్ధ కరోనా నివారణపై లేదు' - రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతల రౌండ్ టేబుల్ సమావేశం

గుంటూరు జిల్లా కొత్తపేటలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు రౌండ్ టేబుల్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం దుకాణాలపై ఉన్న శ్రద్ధ... కరోనా నివారణ చర్యల్లో కనిపించటం లేదని సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, తెదేపా రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు మండిపడ్డారు.

all parties round table meeting about corona prevention in guntur
'ప్రభుత్వానికి మద్యం దుకాణాలపై ఉన్న శ్రద్ధ కరోనా నివారణపై లేదు'

By

Published : Aug 19, 2020, 6:37 PM IST

కరోనా వైరస్ నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, తెదేపా రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు ఆరోపించారు. కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్​లో.. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

2019 డిసెంబర్ లోనే కరోనా వైరస్ అనే విపత్తు వస్తుందని వైద్యులు, మేధావులు హెచ్చరించినా... ప్రభుత్వాలు ఎందుకు మేలుకోలేదని వారు ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలపై ఎందుకు ఇంత నిర్లక్ష్యమని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం దుకాణాలపై ఉన్న శ్రద్ధ... కరోనా నివారణ చర్యల్లో కనిపించటం లేదన్నారు. మద్యం దుకాణాలను తెరవడం వల్లనే కరోనా విజృంభిస్తోందన్నారు. కరోనా వైరస్ బారిన పడిన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందటంలేదని, కొవిడ్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details