రాష్ట్రాన్ని విభజించే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ఆత్మాభిమానాన్ని సోనియా గాంధీ వద్ద తాకట్టు పెట్టినట్లే... రాజధాని విషయంలో వైకాపా శాసనసభ్యులు అలాగే ప్రవర్తించారని జనసేన నాయకులు గద్దె తిరుపతిరావు వ్యాఖ్యానించారు. రాజధాని కోసం రైతులకు సంఘీభావంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే విషయంపైన అన్ని పార్టీల నాయకులు గుంటూరు జిల్లా మంగళగిరిలో సమావేశమయ్యారు. అవసరమైతే ఐకాసగా ఏర్పడి రైతుల తరపున ఎలాంటి ఆందోళనలు చేసేందుకైనా సిద్ధమని పార్టీల నేతలు తెలిపారు. ఇది ఒక్క రాజధాని సమస్య కాదని... రాష్ట్ర సమస్యగా చూడాలని నేతలు పిలుపునిచ్చారు. సోమవారం మరోసారి సమావేశమై పూర్తి స్థాయి కమిటీని ఎన్నుకోనున్నారు. అనంతరం ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.
'అప్పుడు కాంగ్రెస్... ఇప్పడు వైకాపా ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టారు' - all parties meet in mangalagiri
రాజధాని విషయంలో వైకాపా శాసనసభ్యులు చేస్తున్న పనులకు జనసేన నాయకులు గద్దె తిరుపతిరావు స్పందించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో అన్ని పార్టీల నాయకులు సమావేశమయ్యారు

'అప్పుడు కాంగ్రెస్... ఇప్పడు వైకాపా ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టారు'
'అప్పుడు కాంగ్రెస్... ఇప్పడు వైకాపా ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టారు'
ఇదీ చదవండి :