ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్‌ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి..' - latest news in guntur district

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరోనా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని గుంటూరులో విపక్ష నేతలు డిమాండ్ చేశారు. కొవిడ్ సోకిన బాధితులకు 7500 రూపాయల చొప్పున భృతిని అందించాలని కోరారు.

Former Minister Nakka Anandababu
మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

By

Published : Jun 21, 2021, 4:35 PM IST

కొవిడ్‌ మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని గుంటూరులో విపక్ష నేతలు డిమాండ్ చేశారు. కరోనా సోకిన బాధితులకు 7500 రూపాయల చొప్పున భృతిని అందించాలని డిమాండ్ చేశారు. కొవిడ్ వాస్తవ పరిణామాలను ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ ను కలిసిన తెదేపా, వామపక్ష నేతలు వినతి పత్రాన్ని సమర్పించారు. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. వైద్యం, ఆక్సిజన్ అందక ఎందరో ప్రాణాలు కోల్పోయారని.. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో మందులు లభించక నల్లబజారులో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెదేపా నేత తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details