అలీషా మృతిపై మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత యరపతినేని శ్రీనివాసరావు స్పందించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఎక్సైజ్ విభాగాన్ని అడ్డుపెట్టుకుని తెదేపా కార్యకర్త అయిన అలీషాను వైకాపా ప్రభుత్వం చంపించిందని ఆరోపించారు.
అలీషాది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: యరపతినేని శ్రీనివాసరావు - గుంటూరు
గుంటూరు జిల్లాలో అలీ షా ఎక్సైజ్ పోలీసుల తీరు వల్లే చనిపోయాడని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైకాపా ప్రభుత్వమే.. తెదేపా కార్యకర్త అయిన అలీషాను చంపించిందని ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
రాష్ట్రంలో తెదేపా అధికారంలో ఉన్నప్పుడు(1994, 2014) గురజాల నియోజకవర్గంలో గాని, పల్నాడులో గానీ.. ప్రతిపక్ష (వైకాపా) నేతల హత్యలు జరగలేదని గుర్తు చేశారు. ఎక్సైజ్ సీఐ కొండారెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టి త్వరలో జైలుకు పంపిస్తామని అన్నారు. మృతుని కుటుంబానికి కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని, సీఐ కొండారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.