అక్రమ మద్యం, నగదు లావాదేవీలే రత్నశేఖర్ అపహరణకు కారణమని గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు తెలిపారు. నగదు కోసం వేరే వ్యక్తి వాహనాన్ని రత్నశేఖర్ తన స్నేహితుడైన శివకుమార్ వద్ద రూ.లక్షకు తాకట్టు పెట్టాడు. ఈ క్రమంలో శివకుమార్ తెలంగాణ రాష్ట్రం నుంచి 75 మద్యం సీసాలను కారులో తరలిస్తుండగా గుర్తించి.. కారు యజమాని వాహనాన్ని లాక్కున్నాడు.
'మద్యం, నగదు లావాదేవీలే అపహరణకు కారణం' - తాడేపల్లిలో కిడ్నాప్ కేసు
తాడేపల్లిలో అపహరణకు గురైన శేఖర్ కేసు వివరాలను స్థానిక పోలీసులు వెల్లడించారు. అక్రమ మద్యం, నగదు లావాదేవీలే ఈ ఘటనకు కారణమని తెలిపారు. నలుగురు నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు.
'మద్యం, నగదు లావాదేవీలే అపహరణకు కారణం'
దీంతో శేఖర్‌ను శివకుమార్ డబ్బులు అడిగాడు. సరిగా స్పందించకపోవడంతో శేఖర్‌ను అపహరించి డబ్బులు తీసుకోవాలని నిర్ణయించాడు. ఇందులో భాగంగా మే 30న శేఖర్‌ను విజయవాడ నుంచి తాడేపల్లికి రప్పించి అపహరించారు. డబ్బులు కావాలంటూ శేఖర్ తండ్రికి ఫోన్ చేశారు. ఈ ఘటనపై శేఖర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రౌడీషీటర్ శివకుమార్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. కారులో ఉన్న 72మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీచదవండి.