గుంటూరులో మద్యవిమోచన.కామ్ వెబ్సైట్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, మద్యవిమోచన కమిటీ ఛైర్మన్ లక్ష్మణరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మద్యం మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు మధ్య విమోచన రాష్ట్ర ప్రచార కమిటీ ఎనలేని కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ అభినందించారు. మద్యం నియంత్రణలో భాగంగా రోజువారీ కార్యక్రమాలు, ప్రచారాలు, అవగాహన సదస్సుల వివరాలు ఈ సైట్లో పొందుపరిచామని లక్ష్మణరెడ్డి తెలిపారు.
మద్యం నియంత్రణకు మరో ముందడుగు..! - మద్యవిమోచన వెబ్సైట్ ప్రారంభం
గుంటూరులో మద్యవిమోచన.కామ్ వెబ్సైట్ ప్రారంభమైంది. మద్యం నియంత్రణలో భాగంగా రోజువారీ కార్యక్రమాలు, ప్రచారాలు, అవగాహన సదస్సుల వివరాలు ఈ సైట్లో పొందుపరచనున్నారు.
గుంటూరులో మద్యవిమోచన వెబ్సైట్ ప్రారంభిస్తున్న గుంటూరు కలెక్టర్