'ట్రంప్ వస్తే.. జగన్కు ఆహ్వానం లేకపోవడం అవమానకరం' - trump india tour news
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశం వస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆహ్వానం అంది.. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి అందకపోవడం అవమానకరమని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.
'ట్రంప్ వస్తే.. జగన్కు ఆహ్వానం లేకపోవడం అవమానకరం'
ఆర్థిక నేరగాడైన జగన్ను ఆహ్వానిస్తే.. తనకు చెడ్డ పేరు వస్తుందనే ప్రధాని మోదీ.. డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు ఆహ్వానం పంపలేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి అగ్రరాజ్య అధ్యక్షుడు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు తెనాలి పక్కనున్న పెదరావూరు మహిళలకూ ఆయన పక్కన కూర్చునే అవకాశం కల్పించారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందకపోవడం అవమానకరమని వ్యాఖ్యానించారు.