ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమరావతిపై బుగ్గన వ్యాఖ్యలు విడ్డూరం' - వైకాపా పై ఆలపాటి రాజా

రాజధాని అమరావతి నిర్మాణం మా ప్రాధాన్యత కాదన్న ఆర్థిక మంత్రి బుగ్గన వ్యాఖ్యలపై తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజా మండిపడ్డారు. రాజధాని కాకపోతే హింస మీ ప్రాధాన్యమా అని ప్రశ్నించారు.

వైకాపా పై ఆలపాటి రాజా

By

Published : Nov 22, 2019, 12:35 PM IST

Updated : Nov 22, 2019, 6:39 PM IST

ఆర్థికమంత్రి బుగ్గన వ్యాఖ్యలు జగన్ పాలనకు అద్దంపడుతున్నాయని తెదేపా నేత ఆలపాటి రాజా విమర్శించారు. అమరావతి తమ ప్రాధాన్యత కాదని బుగ్గన చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్థికమంత్రి హోదాలో ఉండి అలా మాట్లాడితే... రాష్ట్ర భవిష్యత్తు ఏంటిని నిలదీశారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ హింస వారి ప్రాధాన్యంలా కనిపిస్తోందన్నారు.

రాజధాని అమరావతిని అడుగడుగునా నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారని... రైతుల త్యాగాలు, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఈ ప్రభుత్వానికి పట్టట్లేదని ధ్వజమెత్తారు. పీపీఏల విషయంలో సర్కారు వైఖరి ఆందోళనకు గురిచేస్తోందని... కేంద్రం చెప్పినా పట్టించుకోకపోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.

వైకాపా పై ఆలపాటి రాజా
Last Updated : Nov 22, 2019, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details