ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"నలుగురు పోతే.. నలభై మంది వస్తారు.." - alapati raja fires on 4mps who joined in bjp from tdp

ఆ నలుగురు ఎంపీలు పార్టీ నీడినంత మాత్రాన తెదేపాకు వచ్చిన నష్టమేమీ లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) అన్నారు. వారు పార్టీని వీడటం విశ్వాస ఘాతుకమని ఘాటుగా స్పందించారు.

alapati raja fires on 4mps

By

Published : Jun 21, 2019, 5:03 PM IST

Updated : Jun 21, 2019, 6:07 PM IST

విలీనం చేయటం సిగ్గు చేటు:తెదేపా నేత ఆలపాటి

తెదేపా నుంచి భాజపాలోకి ఫిరాయించిన నలుగురు ఎంపీలు విశ్వాస ఘాతకులని తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజా విమర్శించారు. పార్టీలో తాజా పరిణామాలపై గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో జిల్లా ముఖ్య నేతలు సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపా నుంచి నలుగురు పోతే 40వేల మంది నాయకులు తయారవుతారని చెప్పారు. సుజనా చౌదని, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేష్​కు ప్రజాదరణ లేకపోయినా... పార్టీలో అంకితభావంతో ఉన్నారనే పదవులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. వారు పార్టీ మారటంతోపాటు రాజ్యసభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని భాజపాలో విలీనం చేశామనటం సిగ్గుచేటన్నారు. ఇక పార్టీ మారిన నేతలు తెదేపా కోవర్టులని.. చంద్రబాబే పంపారని కొందరు ప్రచారం చేయటాన్ని తప్పు పట్టారు. తెదేపాకి అలాంటి అవసరం లేదని స్పష్టం చేశారు.

Last Updated : Jun 21, 2019, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details