వైకాపా ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యవహారంపై హైకోర్టు స్పందించటాన్ని తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్వాగతించారు. ఇలాంటి విపత్కర సమయంలో విజయసాయిరెడ్డి... డీ ఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అన్నిచోట్లా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ఇక ప్రభుత్వ భవనాలకు రంగుల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన 623 జీవోను హైకోర్టు కొట్టివేయటంపై హర్షం వ్యక్తం చేశారు. పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలకు వద్దని హైకోర్టు చెప్పినా... మళ్లీ జీవోలు తేవటాన్ని ఆయన తప్పుబట్టారు.
'ప్రజలకేనా లాక్డౌన్... వైకాపా నేతలకు కాదా..?' - తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ వార్తలు
రాష్ట్రంలో లాక్ డౌన్ కేవలం ప్రజలకు మాత్రమే అన్నట్లుగా... వైకాపా నేతలకు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. అన్నిచోట్లా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారని ఆరోపించారు.
!['ప్రజలకేనా లాక్డౌన్... వైకాపా నేతలకు కాదా..?' alapati comments on ysrcp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7068542-488-7068542-1588669666642.jpg)
alapati comments on ysrcp