ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకోవాలి: ఆలపాటి - మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలి

అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు 200వ రోజుకు చేరుతున్నా... రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి చలనం లేదని మండిపడ్డారు.

మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలి: ఆలపాటి
మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలి: ఆలపాటి

By

Published : Jul 4, 2020, 9:59 AM IST

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షలు 200వ రోజుకు చేరుతున్నా... రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి చలనం లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. అమరావతినే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రజలు, ప్రవాసాంధ్రులు కోరుతున్నా.. ముఖ్యమంత్రి జగన్ స్పదించకపోవటం దారుణమన్నారు.

మూడు రాజధానుల ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆలపాటి డిమాండ్​ చేశారు. రాజధాని కోసం ప్రాణాలర్పించిన రైతుల త్యాగం వృథా కాదన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details