రైతులకు మద్దతుగా తెదేపా, జనసేన, వామపక్షాల నిరసన దీక్ష - రైతులకు మద్దతుగా తెదేపా,జనసేన, వామపక్షాలు నిరసన దీక్ష
రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టాయి విపక్షాలు. దీక్షలో తెదేపా, జనసేన, వామపక్షాలు పాల్గొన్నాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశాయి.
akhilapaksham-protest-for-amaravathi
రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లా వినుకొండలో తెదేపా, జనసేన, వామపక్ష నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. వినుకొండ నియోజకవర్గ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి... రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. మూడు రాజధానులు వద్దు-అమరావతి ముద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాజధాని రైతులకు తామూ అండగా ఉంటామని స్థానిక రైతులు తెలిపారు. ప్రభుత్వ ఏకపక్ష ధోరణి మంచిది కాదంటూ హెచ్చరించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.