కొవిడ్ వంటి ఆపత్కాలంలో కరోనా వైరస్ బారిన పడిన రోగులకు సేవలందించడంలో 108 అంబులెన్స్ సిబ్బంది సేవలు అమోఘమని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. ఆపద కాలంలో శరవేగంగా స్పందించి లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్నారని వారిని అభినందించి ప్రోత్సహించడం మన బాధ్యత అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా 108 సిబ్బందికి సత్కారం చేయడం మంచి విషయమన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అజేయ కల్లం అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, విడదల రజిని, తదితరులు పాల్గొన్నారు.
108 అంబులెన్స్ సిబ్బంది సేవలు అమోఘం: అజేయ కల్లం
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో 108 అంబులెన్స్ సర్వీస్ సిబ్బందికి సత్కారం చేశారు. గుంటూరు హిందూ ఫార్మసీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం హాజరయ్యారు.
ajay kallam on 108 employees