కరోనా వైరస్ బాధితుల క్వారంటైన్ ఏర్పాటుకు మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) చర్యలు చేపట్టింది. ఎయిమ్స్ భవనంలోని పురుషుల యూజీ వసతి గృహాన్ని క్వారంటైన్‌గా మార్చింది. 12 అంతస్తుల భవనంలో 6 అంతస్తులను క్వారంటైన్‌గా సిద్ధం చేశారు. ఒక్కో గదిలో ఇద్దరు ఉండేలా సుమారు 60 బెడ్లు ఏర్పాటుచేశారు. ఒక్కో అంతస్తుకు ఓ వైద్యుడు, ఇద్దరు నర్సులు, ఒక సహాయకుడు విధుల్లో ఉంటారని ఎయిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేష్ కక్కర్ తెలిపారు. క్వారంటైన్‌కు కావాల్సిన సామగ్రిని ఎయిమ్స్ కొనుగోలు చేసిందన్నారు. త్వరలోనే పూర్తి స్థాయి ఐసోలేషన్ వార్డు సిద్ధమవుతోందన్న ఆయన.. కరోనా నిర్ధరణ పరీక్షలకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని చెప్పారు.
మంగళగిరి ఎయిమ్స్‌లో క్వారంటైన్ కేంద్రం - మంగళగిరి ఎయిమ్స్ లో క్వారంటైన్ ఏర్పాటు
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా కొవిడ్ 19 అనుమానితుల కోసం మంగళగిరి ఎయిమ్స్ క్వారంటైన్ గదులు సిద్ధం చేస్తోంది. 12 అంతస్తులున్న ఎయిమ్స్ యూజీ వసతి గృహంలోని ఆరు అంతస్తులను.. క్వారంటైన్‌గా మార్చింది. అక్కడ ఉండే వారిని చూసుకునేందుకు కావాల్సిన సిబ్బందిని నియమించింది. త్వరలోనే పూర్తిస్థాయి ఐసోలేషన్ వార్డు సిద్ధం చేస్తామని ఎయిమ్స్ సూపరింటెండెంట్ డా.రాజేష్ కక్కర్ తెలిపారు.
మంగళగిరి ఎయిమ్స్‌లో క్వారంటైన్ గదులు ఏర్పాటు