రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు సరఫరా చేసేందుకు ఏపీ ఆగ్రోస్తో.. వేద సీడ్స్ కు ఒప్పందం కుదిరింది. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. అక్కడే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందించనున్నారు. ఈ మేరకు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఏపీ ఆగ్రోస్... రైతులకు విత్తనాలు సరఫరా చేయనుంది.
ఈ క్రమంలోనే.. ముందుగా వేద సీడ్స్ తో ఏపీ ఆగ్రోస్ ఒప్పందం చేసుకుంది. మిగతా సంస్థలతోనూ ఈ ప్రక్రియ ప్రారంభించింది. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాము పూర్తిగా సహకరిస్తామని వేద సీడ్స్ ఎండీ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ తులసి ధర్మచరణ్ తెలిపారు. బిల్లుల చెల్లింపు విషయంలోనూ ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.