ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ప్రభుత్వ తీరు సరికాదు"

అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ తప్పుబట్టారు. 20 వేల లోపు డిపాజిట్లు ఉన్న వారికి ఈ ఏడాది డిసెంబర్ లోగా... అంతకు మించి కట్టిన వారికి 2021 మార్చికల్లా చెల్లింపులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

మాట్లాడుతున్న అగ్రిగోల్డ్ కస్టమర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు
మాట్లాడుతున్న అగ్రిగోల్డ్ కస్టమర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు

By

Published : Sep 30, 2020, 5:16 PM IST

అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందంటూ అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ గుంటూరులో ఆగ్రహించారు. హైకోర్టు ఆదేశాలు రావాలని సీఐడీ అధికారులు మోకాలడ్డుతున్నారని ఆయన ఆరోపించారు. 10 వేల లోపు కట్టిన 3 లక్షల 45వేల మంది డిపాజిటర్లకు చెల్లింపులు చేసినపుడు కోర్టు అభ్యంతర పెట్టలేదని గుర్తు చేశారు.

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అందరికీ చెల్లింపులు చేస్తామని చెప్పి ఇపుడు ఏడాదిన్నర గడిచినా ఇంకా నెరవేర్చకపోవటం సరికాదన్నారు. 20 వేలలోపు డిపాజిట్లు ఉన్న వారికి ఈ ఏడాది డిసెంబర్ లోగా... అంతకు మించి కట్టిన వారికి 2021 మార్చికల్లా చెల్లింపులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసినట్లుగా కాలయాపన చేస్తే వారికి పట్టిన గతే వైకాపా సర్కారుకు పడుతుందని ఆయన హెచ్ఛరించారు.

ABOUT THE AUTHOR

...view details