ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరెస్టులు అడ్డుకోలేరు.... చలో అసెంబ్లీని నిర్వహించి తీరుతాం - agrigold chalo assembly update news

అగ్రిగోల్డ్ బాధితుల చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు చర్యలో భాగంగా, సీపీఐ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. తమను అరెస్టు చేసినా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని నేతలు స్పష్టం చేశారు.

agrigold victims arrest
చలో అసెంబ్లీను అడ్డుకున్న పోలీసులు

By

Published : Jun 17, 2020, 11:38 AM IST

అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు అరెస్టులలో భాగంగా అగ్రిగోల్డ్ బాధితులను, సీపీఐ నేతలను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో పలువురు నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్​ను పాత గుంటూరు పోలీస్ స్టేషన్​కి, నగర కార్యదర్శి కోట మాల్యాద్రిని అరుండల్​పేట పోలీస్ స్టేషన్​కి తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ నేత జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ.. పోలీసులు ఎన్ని అరెస్టులు చేసినా, గృహానిర్బంధం చేసినా.. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అరెస్ట్​లతో తమను ఆపలేరని చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని అజయ్ కుమార్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details