ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పువ్వుల్లో పెట్టి డబ్బులిస్తామని చెప్పి.. ఇప్పుడు ఎందుకు మరచిపోయారు' - guntur latest news

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా అగ్రిగోల్డ్‌ బాధితులకు డబ్బులిస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు అని అగ్రిగోల్డ్‌ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం ధ్వజమెత్తింది. అగ్రిగోల్డ్‌ బాధితులకు పువ్వుల్లో పెట్టి డబ్బులిస్తామని చెప్పిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. ఇప్పుడు ఎందుకు మరచిపోయారని ప్రశ్నించింది.

agrigold loan
agrigold loan

By

Published : Jul 18, 2021, 10:19 AM IST

‘‘అగ్రిగోల్డ్‌లో రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన 13.50 లక్షల మంది బాధితులకు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా డబ్బులు చెల్లిస్తామని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి 26 నెలలు గడుస్తున్నా బాధితుల్ని పట్టించుకోవట్లేదు’’ అని అగ్రిగోల్డ్‌ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం ధ్వజమెత్తింది. విజయవాడలో శనివారం నిర్వహించిన సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ బాధితులకు పువ్వుల్లో పెట్టి డబ్బులిస్తామని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి.. ఇప్పుడు మరచిపోయారన్నారు.

బాధితుల కోసం తొలి బడ్జెట్‌లో రూ.1,150 కోట్లు, ఆ తర్వాత బడ్జెట్లలో రెండేళ్లపాటు రూ.200 కోట్లు చొప్పున కేటాయించిన ప్రభుత్వం ఇప్పటివరకు రూ.234 కోట్లు మాత్రమే పంపిణీ చేసిందన్నారు. ఈనెల 22 నుంచి 28వ తేదీ వరకూ అన్ని జిల్లాల్లోనూ, విజయవాడలోని ధర్నా చౌక్‌లోనూ బాధితులతో దీక్షలు నిర్వహిస్తామని, అప్పటికీ స్పందించకపోతే ఈనెల 31న సీఎం క్యాంపు కార్యాలయానికి విజ్ఞాపన యాత్ర చేపడతామని ప్రకటించారు. కార్యక్రమంలో సంఘం డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ బీవీ చంద్రశేఖర్‌, అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌, ఏజెంట్స్‌ సంక్షేమ సంఘం కమిటీ నాయకులు రాంబాబూ, ఎస్‌కే షరీఫ్‌, ఇన్సాఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సయ్యద్‌ అఫ్సర్‌ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details