బడ్జెట్లో కేటాయించిన 1150 కోట్లను ఈ నెలాఖరులోగా విడుదల చేయాలంటూ గుంటూరులో అగ్రిగోల్డ్ ఖాతాదారులు మళ్లీ నిరసనకు దిగారు. కొత్త పేట మల్లయ్య లింగం భవన్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 48 గంటల నిరాహార దీక్షలను జిల్లా అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ ప్రారంభిచారు. 20 వేలు పైబడి చెల్లింపులు జరపాల్సిన ఖాతాదారులకు 50 శాతం మొత్తాన్ని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎంతోమంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని గుర్తుచేసిన ఆయన మరిన్ని ఆత్మహత్యలు జరగక ముందే ప్రభుత్వం మేల్కోవాలని హితవు పలికారు.
గుంటూరులో అగ్రిగోల్డ్ ఖాతాదారుల 48 గంటల దీక్ష - 48 గంటల దీక్షలు తాజా వార్తలు
గుంటూరులో అగ్రిగోల్డ్ ఖాతాదారులు మళ్లీ నిరసనకు దిగారు. కొత్త పేట మల్లయ్య లింగం భవన్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షలను జిల్లా అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ప్రారంభించారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు.
అగ్రిగోల్డ్ ఖాతాదారుల 48 గంటల దీక్ష