గుంటూరు జిల్లా క్రోసూరు, అచ్చంపేట మండలం పీసపాడు గ్రామాల్లో నకిలీ ఆర్మూర్ మిర్చి విత్తనాలను వ్యవసాయ అధికారులు గుర్తించారు. జిల్లా కార్యాలయానికి వచ్చిన సమాచారంతో మండలాల్లోని మిరప నర్సరీలను అధికారులు పరిశీలించారు. ఈ తనిఖీల్లో.. కొందరు రైతులు ఎలాంటి బిల్లులు లేకుండానే ఆర్మూర్ మిరప విత్తనాలను కొని నాటినట్లు గుర్తించారు. రైతు భరోసా కేంద్రంలో ఉన్న ఆర్మూర్ విత్తనాలతో పోల్చిచూడగా.. రైతులు కొన్నవి నకిలీ విత్తనాలుగా అధికారులు గుర్తించారు. విత్తనాలు వేసి నష్టపోయిన రైతులు మండల వ్యవసాయ అధికారులు లేదా జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని గుంటూరు జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకురాలు విజయభారతి సూచించారు.
అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన.. నకిలీ మిర్చి విత్తనాల గుర్తింపు - fake chilli seeds in Guntur district crime
నకిలీ విత్తనాల విక్రయాలతో అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. ప్రముఖ కంపెనీలకు చెందిన ప్యాకెట్లలో నకిలీ విత్తనాలను నింపి అన్నదాతలకు అంటగడుతున్నారు. మోసాన్ని గుర్తించని రైతులు.. వాటిని పొలాల్లో నాటుతున్నారు. ఫలితంగా విత్తనాలు మొలకెత్తక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ అధికారులు.. నకిలీ మిర్చి విత్తనాలను గుర్తించారు.
మిరప నారు నర్సరీలను పరిశీలిస్తున్న అధికారులు
TAGGED:
గుంటూరు జిల్లా నేర వార్తలు