ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే ఆర్కే పొలాన్ని పరిశీలించిన వ్యవసాయ అధికారులు - మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తాజా వార్తలు

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పొలాన్ని వ్యవసాయ అధికారులు పరిశీలించారు. కల్తీ విత్తనాల వల్ల తన పంట పాడైందని ఆయన చేసిన ఫిర్యాదు మేరకు పొలాన్ని పరిశీలించారు. తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

agriculture officers visit mangalagiri mla rk farm
ఎమ్మెల్యే ఆర్కే పొలాన్ని పరిశీలించిన వ్యవసాయ అధికారులు

By

Published : Oct 29, 2020, 4:04 PM IST

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పొలాన్ని విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ అధికారులు పరిశీలించారు. ఫిరంగిపురం మండలం వేమవరంలో సాగు చేస్తున్న తన పొలంలో పంట పాడైందని ఆయన వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అధికారులు పంటను పరిశీలించారు. గింజలు లేని కంకులను ఆర్కే వారికి చూపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ సుమలత మాట్లాడుతూ.. మంగళగిరి శాసనసభ్యులు ఆర్కే ఏపీ సీడ్స్ ద్వారా బీపీటీ 5204 వరి విత్తనాలు 5 సంచులు కొనుగోలు చేశారన్నారు. వాటిలో 3 సంచుల్లో కల్తీ విత్తనాలు కనుగొన్నట్లు చెప్పారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details