గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెం వద్ద అక్రమంగా బయో ఉత్పత్తులు తయారు చేస్తున్న స్థావరంపై.. వ్యవసాయ, పోలీసు అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు 20 రకాల ఉత్పత్తులతో పాటు ఖాళీ డబ్బాలు, వివిధ రకాల పేర్లతో ఉన్న లేబుల్స్, స్టాంపు ముద్రలను అధికారులు పరిశీలించారు. రూ. 4 లక్షల విలువైన సామగ్రి తయారు చేసినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు.
గడువు ముగిసిన పురుగు మందు డబ్బాలపై.. పాత లేబుల్స్ తొలగించి కొత్తవి అతికిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. తయారు చేసిన బయో ఉత్పత్తులను దుర్గి, విజయవాడ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని అంచనాకు వచ్చారు. నిందితుడు రమేష్ నుంచి ఇతర వివరాలను సేకరిస్తున్నారు.
బయో మందులు వాడొద్దు...