అధికార పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పొలంలోని వరి పంటను వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించారు. ఫిరంగిపురం మండలం వేమవరంలో తనకు చెందిన 13 ఎకరాల్లో వరి పంటను ఆళ్ల సాగు చేశారు. అందులోని 5 ఎకరాల్లో నకిలీ విత్తనాలు ఉన్నాయని ఎమ్మెల్యే ఆర్కే... అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ అధికారులు పంటను పరిశీలించారు. ఐదు ఎకరాల పొలంలో అక్కడకక్కడ కేళీలు ఉన్నాయని అధికారులు తెలిపారు. విత్తన నాణ్యతను తెలుసుకునేందుకు ప్రయోగశాలకు పంపించినట్లు చెప్పారు. నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.