అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాధితుల సంఘం ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితులకు న్యాయం చేస్తానన్న సీఎం జగన్... మిగిలి ఉన్న బాధితులకూ చెల్లింపులు చెయ్యాలని కోరారు. అగ్రిగోల్డ్ ఆస్తులు చాలా ఉన్నాయని వాటిని ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించుకుని బాధితులకు త్వరితగతిన న్యాయం చెయ్యాలని బాధితుల సంఘం జిల్లా కార్యదర్శి అగస్టీన్ కోరారు.
'అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేయాలి' - అగ్రిగోల్డ్ బాధితులపై వార్తలు
గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట అగ్రిగోల్డ్ బాధితులు నిరసన చేపట్టారు. మిగిలి ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చెయ్యాలని కోరారు.

గుంటూరు కలెక్టరేట్ వద్ద అగ్రిగోల్డ్ బాధితుల నిరసన