ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం స్పందించకుంటే.. అసెంబ్లీ ముట్టడి: అగ్రిగోల్డ్ బాధితులు - ఏపీలో అగ్రిగోల్డ్ బాధితుల వార్తలు

అగ్రిగోల్డ్ బాధితులను సీఎం ఆదుకుంటామని చెప్పి ఏడాది పూర్తైనా.. పట్టించుకోవడం లేదని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. సీఎం స్పందించకపోతే.. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో అగ్రిగోల్డ్ బాధితులతో కలసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

agri gold
agri gold

By

Published : Jun 8, 2020, 4:01 PM IST

అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. ఎన్నికలకు ముందు 20 వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు 3 నెలల్లో నగదు చెల్లిస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం.. ఇప్పటికీ మాట నిలబెట్టుకోలేదన్నారు. ఏడాది గడిచినా బాధితులకు నగదు అందించలేదని ఆగ్రహించారు.

డిసెంబర్ లో సాయం చేస్తామని చెప్పిన సీఎం జగన్... ఆ విషయంపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల తరుపున రేపు ముఖ్యమంత్రితో చర్చిండానికి అపాయింట్‌మెంట్ కోరామన్నారు. సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే.. ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తామని హెచ్చరించారు. మంగళగిరి అంబేద్కర్ విగ్రహం నుంచి పాదయాత్రగా ఛలో అసెంబ్లీ కార్యకమానికి శ్రీకారం చుడతామన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలోనే 13 జిల్లాల నుంచి అగ్రిగోల్డ్ బాధితులతో కలసి అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details