ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

షాపింగ్‌ సందడి షురూ... కానీ..! - గుంటూరు తాజా వార్తలు

సరదాగా షాపింగ్‌... అనే మాట ఇక గతం కానుంది. కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న వేళ... ఎక్కడికెళ్తే ఏమవుతుందోనన్న ఆందోళన మొదలైంది. ఈ తరుణంలో షాపింగ్‌ మాళ్ల యజమానులు అనేక జాగ్రత్తలు తీసుకుని వినియోగదారుల్లో భయం పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరులో మాల్స్‌ వద్ద కరోనా నివారణ కోసం తీసుకుంటున్న చర్యలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Shopping Malls opened in guntur
షాపింగ్‌ సందడి షురూ

By

Published : Jun 8, 2020, 9:49 PM IST

కరోనా లాక్​డౌన్ ఆంక్షలు క్రమంగా తొలగిపోతున్న తరుణంలో షాపింగ్ మాల్స్​కు ప్రభుత్వం అనుమతించింది. ఈ క్రమంలో గుంటూరు నగరంలో ముఖ్యమైన మాల్స్​ అన్నీ తెరచుకున్నాయి. మాల్స్​ యజమానులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని కొనుగోలుదారులను లోపలకి అనుమతిస్తున్నారు.

జాగ్రత్తలివే..!

  • ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. మాస్క్ లేకపోతే షాపింగ్ మాల్ వారే అందజేస్తున్నారు. కొందరైతే గ్లౌజులు కూడా ఇస్తున్నారు.
  • భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ వేశారు.
  • కొన్ని షాపింగ్​ మాల్స్​లో లోపలకు ప్రవేశించే సమయంలోనే క్రిమి సంహారక టన్నెల్ ద్వారా వెళ్లేలా ఏర్పాట్లు.
  • వినియోగదారుల పేర్లు, ఫోన్ నెంబర్లు రికార్డులో నమోదు చేసుకుంటున్నారు.
  • వినియోగదారులకు థర్మల్​ స్కానర్​ ద్వారా పరీక్షలు.
  • ప్రతి ఒక్కరూ శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకునేలా చర్యలు.
  • ఎప్పటికప్పుడు మాల్ మొత్తాన్ని శానిటైజ్​ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details