ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాంధీభవన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ కృషి..9 ఏళ్ల తరువాత కొడుకు దగ్గరకు తల్లి - An initiative of Gandhi Bhavan International Trust

9 years Back To Home: కేరళకు చెందన ఓ స్వచ్ఛంద సంస్థ తప్పిపోయిన వారిని వారిని తమ బంధువులకు అప్పగిస్తుంటారు. అలాగే మన రాష్ట్రానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో మతి స్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయింది. 9 సంవత్సరాల తరువాత ఆమెను కుమారుడి దగ్గరకు చేర్చారు. ఆ సంస్థ పేరే గాంధీభవన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్. అతను వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 22, 2023, 11:41 AM IST

Updated : Feb 22, 2023, 2:12 PM IST

After 9 years Back Mother To Home : ఆమె భర్తతో జీవితాంతం జీవించాలని పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. కానీ అతను ఆమెను ఆర్థాంతరంగా విడిచి తిరిగి రాని లోకాలను వెళ్లాడు. అతని మరణాన్ని తట్టుకోలేని ఆమె మతి స్థిమితం కోల్పోయింది. ఎక్కడికి వెళుతుందో ఆమెకు తెలిసేది కాదు. అలా ఆమె ఇతర రాష్ట్రానికి వెళ్లింది. కుమారుడు ఆమె కోసం గాలింపు చర్యలు చెపట్టాడు. కానీ ఎటువంటి ఫలితం లేదు. ఒక అనాథగా ఆశ్రమంలో ఉండేది ఆమె. కానీ 9 సంవత్సరాల తరువాత ఆ స్వచ్ఛంద సంస్థ వారి చొరవతో కుమారుడి దగ్గరుకు చేరింది.

గాంధీభవన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ కృషి..9 ఏళ్ల తరువాత కొడుకు దగ్గరకు తల్లి

గాంధీ భవన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్.. ఆనందంలో కుమారుడు : దాదాపు 9 ఏళ్ల క్రితం తప్పిపోయిన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడుకు చెందిన మహిళను కేరళకు చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తిరిగి ఆమె బంధువులకు అప్పగించారు. చిట్టిబొమ్మ ఝాన్సీ తన భర్త మృతితో మతి స్థిమితం కోల్పోయింది. ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె కేరళకు చేరుకున్నారు. ఆ రాష్ట్రంలో అనాథలను గుర్తించి వారి స్వగ్రామాలకు పంపించే బాధ్యతను గాంధీ భవన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ నిర్వర్తిస్తోంది. ఝాన్సీని కొల్లాంలోని ఓ అనాథాశ్రమంలో గుర్తించిన ఆ సంస్థ ప్రతినిధులు ఆమె వివరాలు సేకరించి రేవేంద్రపాడులోని ఝాన్సీ కుమారుడు రాజేశ్ కు వీడియో కాల్ ద్వారా తెలిపారు. అతడు గుర్తు పట్టడంతో ఝాన్సీని దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చారు. కుమారుడు రాజేష్‌కు తల్లిని అప్పగించారు. వారు సంతోషం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ ఇంటర్నేషనల్ సంస్థ వారికి కృతజ్ఞతలు రాజేష్‌ చెప్పారు.

" మా అమ్మ 9 సంవత్సరాల క్రితం తప్పిపోయింది. కేరళ కొల్లాం జిల్లా వాళ్లు చేరదీసి నాకు నాలుగు రోజుల క్రితం సమాచారం ఇచ్చారు. వాళ్లు మా అమ్మని సురక్షితంగా అప్పగించారు. వారికి ధన్యవాదాలు " - రాజేష్, ఝాన్సీ కుమారుడు

ఇవీ చదవండి

Last Updated : Feb 22, 2023, 2:12 PM IST

ABOUT THE AUTHOR

...view details