ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎస్​ఈసీ విషయంలో హైకోర్టు తీర్పు అమలు తప్ప వేరే మార్గం లేదు' - ఏపీ ఎన్నికల కమిషనర్ లేటెస్ట్ వార్తలు

ఎస్​ఈసీ విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయటం తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి వేరే ప్రత్యామ్నాయం లేదని న్యాయవాది నర్రా శ్రీనివాస్ స్పష్టం చేశారు.

advocate narra srinivas rao
'ఎస్​ఈసీ విషయంలో హైకోర్టు తీర్పు అమలు తప్ప వేరే మార్గం లేదు'

By

Published : Jul 24, 2020, 4:54 PM IST

'ఎస్​ఈసీ విషయంలో హైకోర్టు తీర్పు అమలు తప్ప వేరే మార్గం లేదు'

ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ నియామకానికి సంబంధించి హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందని న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. పదేపదే దీనిపై స్టే ఇవ్వాలని కోరడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిందన్నారు. తాము ఉద్దేశపూర్వకంగానే స్టే ఇవ్వటం లేదని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించటం... హైకోర్టు తీర్పును తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించటమేనన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తీర్పును అమలు చేయడమే ఏకైక మార్గమని తెలిపారు. ఎన్నికల కమిషనర్ నియామకంలో గవర్నర్ కు సర్వాధికారాలు ఉన్నాయని నర్రా శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. గవర్నర్ ప్రభుత్వానికి రాసిన లేఖలో రమేష్ కుమార్ ని నియమిస్తున్నట్లు చెబితే సరిపోయేదంటోన్న శ్రీనివాస్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి.

ఇవీ చూడండి-గవర్నర్​ ఆదేశాలిచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవటం దారుణం:సుప్రీం

ABOUT THE AUTHOR

...view details