ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు

Relationship Problems: నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈ రకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి ఏమైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

tips for couples
దంపతులకు చిట్కాలు

By

Published : Jan 26, 2023, 2:58 PM IST

Relationship Problems: ముందుగా మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం.

మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఒక్కసారి ఆలోచించుకోండి.

మీరిద్దరూ కూడా మ్యారేజ్ కౌన్సెలింగ్‌కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details