రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ ప్రకటించారు. పల్నాడు ప్రాంతంలో పరిస్థితి దిగజారిందని ఓ పార్టీ చేసిన ఆరోపణలు నిజం కాదని స్పష్టం చేశారు. ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశించినట్లు వెల్లడించారు. పల్నాడు ప్రాంతంలోని శాంతి భద్రతలపై మీడియాతో మాట్లాడిన ఆయన... ఒక వర్గంపైనే కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు కొట్టిపారేశారు. ఆత్మకూరులోనూ ఎవరూ భయభ్రాంతులతో ఊరు విడిచి వెళ్లలేదని... కూలి పనుల కోసమే వెళ్లారన్నారు. పల్నాడులో జరిగిన హత్యలు రాజకీయ ప్రేరేపితమైవి కావని రౌడీ గ్రూపుల దాడులని ఏడీజీ తెలిపారు. పల్నాడులో ఘర్షణలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయని ఎస్పీ జయలక్ష్మి అన్నారు. ప్రతి ఘర్షణను రాజకీయ ఘర్షణగా మారుస్తున్నారని ఎస్పీ చెప్పారు. స్నేహపూర్వక వాతావరణం ఉండేలా కౌన్సిలింగ్ చేస్తున్నామని... గొడవలు సృష్టించే వారిపై రౌడీషీట్ తెరిచామని తెలిపారు.
'పల్నాడులో హత్యలు రాజకీయ ప్రేరేపితమైనవి కావు' - police on palnadu issue
పల్నాడు ప్రాంతంలో పరిస్థితులు దిగజారాయంటూ ఓ పార్టీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ వివరించారు. అక్కడ జరిగిన గొడవలు రాజకీయ ప్రేరేపితం కావని ఆయన తెలిపారు. ఆత్మకూరులోనూ ఎవరూ భయభ్రాంతులతో ఊరు విడిచి వెళ్లలేదని...కూలిపనుల కోసమే వెళ్లారని స్పష్టం చేశారు.
పల్నాడు పరిస్థితులపై ఏడీజీ రవిశంకర్
Last Updated : Oct 12, 2019, 5:07 PM IST